Junk Food: బర్గర్ లవర్స్‌కు షాక్.. ప్యాకింగ్‌ వల్ల ప్రాణాపాయమే..!

|

Apr 05, 2023 | 3:18 PM

అతిగా పిజ్జాలు, బర్గర్లు, డోనట్స్ తినే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం వల్ల వచ్చే సమస్యలను పక్కనపెడితే ముఖ్యంగా వాటిని ప్యాక్ చేయడానికి రాపింగ్ పేపర్ల వల్ల మరింత ప్రమాదమని నిపుణులు పేర్కొంటున్నారు.

Junk Food: బర్గర్ లవర్స్‌కు షాక్.. ప్యాకింగ్‌ వల్ల ప్రాణాపాయమే..!
Warapping
Follow us on

ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. గతంలో స్నాక్ టైంలో ఇంటి ఆహారాన్ని తినే పిల్లలు ప్రస్తుతం మాత్రం స్నాక్స్ అంటే ఎక్కువగా వాటినే తింటున్నారు. బర్గర్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెడితే చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా తింటున్నారు. అయితే అతిగా పిజ్జాలు, బర్గర్లు, డోనట్స్ తినే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం వల్ల వచ్చే సమస్యలను పక్కనపెడితే ముఖ్యంగా వాటిని ప్యాక్ చేయడానికి రాపింగ్ పేపర్ల వల్ల మరింత ప్రమాదమని నిపుణులు పేర్కొంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాడే రాపింగ్ పేపర్‌లో వాడే కెమికల్స్ వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే పేపర్ కప్, వాటిని పెట్టడానికి వాడే పేపర్ బౌల్స్ అన్నింటి వల్ల ప్రమాదమేనని పేర్కొంటున్నారు. ఎందుకంటే వీటిని తయారు చేసే సమయంలో పెర్ఫ్లూరోక్టానోయిక్ సల్ఫేట్ (పీఎఫ్ఓఎస్), పాలీఫ్లోరోఅల్కైల్ (పీఎఫ్ఏఎస్) అనే ప్రమాదకర రసాయనాలు వాడతారు. పేపర్ ప్లేట్ తడిచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి పై పూతగా వీటిని వాడతారు. అయితే ఈ రసాయనాలు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. 

పేపర్ ప్లేట్స్, రేపర్ల వల్ల కాలేయ సమస్యలు వస్తాయని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కెనడా, యుఎస్, స్విట్జర్లాండ్ పరిశోధకులు 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరీక్షించగా ఈ విషయం తెలిసింది. పరీక్షలు చేసిన వాటిలో కంపోస్టబుల్ పేపర్ బౌల్స్, శాండ్‌విచ్, బర్గర్ రేపర్లు, పాప్‌కార్న్ సర్వింగ్ బ్యాగ్‌లు, డోనట్స్ వంటి డెజర్ట్‌ల బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ పరిశోధనలో ఆయా ఆహార పదార్థాల్లో 45 శాతం అధికంగా ఫ్లోరిన్ ఉన్నట్లు తేలింది. పీఎప్ఏఎస్ వల్లే ఆహారంలో ఫ్లోరిన్ పెరిగిందని నిపుణులు కనుగొన్నారు. బర్గర్‌లు, పేస్ట్రీలు, డోనట్స్ వంటి జిడ్డు ఉన్న వస్తువుల ప్యాకింగ్‌కు ఉపయోగించే పేపర్ బ్యాగ్‌ల్లో, కంపోస్టబుల్ పేపర్ బౌల్స్‌లో అత్యధిక స్థాయిలో ఫ్లోరిన్, ఫీఎఫ్ఏఎస్ ఉందని తేలింది. అంటే వేడివేడి ఆహారాన్ని ప్యాకింగ్ చేయడం వల్ల ప్యాకింగ్ బౌల్స్ తయారు చేసే సమయంలో వాడిని పీఎఫ్ఏఎస్ ఆహారంలోకి చేరుతుంది. ముడిపల్ప్‌ను బలంగా ఉంచడానికి వాడే ఈ కెమెకల్స్ మనిషి ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేసిన పరిశోధనల్లో పీఎఫ్ఏస్ స్థాయిలు పెరిగితే క్యాన్సర్‌ ప్రమాదం, రోగనిరోధక మందగించడం, సంతానోత్పత్తిపై ప్రభావం, ఊబకాయం వంటి సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంతగా వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..