జగన్ అప్పుడలా.. చంద్రబాబు ఇప్పుడిలా.. ఫోటోలు వైరల్!

రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో వైసీపీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 8న విజయవాడలోని బెంజ్ సర్కిల్‌ వద్ద చంద్రబాబు చేసిన ధర్నా తీవ్రతరమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ రోజు అమరావతి ఐక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగాల్సి ఉంది. కానీ అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా బస్సులను కూడా సీజ్ చేయడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం […]

జగన్ అప్పుడలా.. చంద్రబాబు ఇప్పుడిలా.. ఫోటోలు వైరల్!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 4:50 AM

రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో వైసీపీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 8న విజయవాడలోని బెంజ్ సర్కిల్‌ వద్ద చంద్రబాబు చేసిన ధర్నా తీవ్రతరమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ రోజు అమరావతి ఐక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగాల్సి ఉంది. కానీ అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా బస్సులను కూడా సీజ్ చేయడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అటు జేఏసీ నేతలు కూడా ఆయన వెంటే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీని వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో చంద్రబాబు, జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

ఇక ఇప్పుడు చంద్రబాబు బెంజ్ సర్కిల్ దగ్గర బైఠాయించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోతో పాటుగా మూడేళ్ళ కిందట జనవరి 26న వైజాగ్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై బైఠాయించిన జగన్, వైసీపీ నేతల ఫోటోను కూడా జత చేసి కొంతమంది నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. అప్పట్లో జగన్ ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేపట్టిన క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకోగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో జగన్‌తో పాటుగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు రన్‌వే పైనే బైఠాయించిన విషయం విదితమే.

Latest Articles
అందం ఈ వయ్యారిని మనువాడిందేమో.. ఈమెను హత్తుకొని తేరుగుతుంది..
అందం ఈ వయ్యారిని మనువాడిందేమో.. ఈమెను హత్తుకొని తేరుగుతుంది..
IPL 2024: ఇలా జరిగితేనే ప్లేఆఫ్స్‌కు బెంగళూరు..
IPL 2024: ఇలా జరిగితేనే ప్లేఆఫ్స్‌కు బెంగళూరు..
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..