Vizag Airport: ఏపీ వాసులకు షాక్.. వైజాగ్‌‌కు ప్రముఖ ఎయిర్‌లైన్ సర్వీసులు రద్దు…

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:31 PM

ఏపీకి పరిపాలనా రాజధానిగా విశాఖను చేసి అక్కడ నుంచి పాలన కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతుండగా.. విశాఖ విమానయాన రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Vizag Airport: ఏపీ వాసులకు షాక్.. వైజాగ్‌‌కు ప్రముఖ ఎయిర్‌లైన్ సర్వీసులు రద్దు...
Follow us on

Vizag Air Services: ఏపీకి పరిపాలనా రాజధానిగా విశాఖను చేసి అక్కడ నుంచి పాలన కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతుండగా.. విశాఖ విమానయాన రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రెండు విమాన సంస్థలు విశాఖ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. చెన్నై- వైజాగ్- చెన్నై, హైదరాబాద్- వైజాగ్- హైదరాబాద్ విమానాలు నడుపుతున్న ఇండిగో సంస్థ ఆ సర్వీసులను మార్చి 2వ వారం నుంచి రద్దు చేయనుంది.

Also Read: Lakhs Of Rupees For Old Coins And Notes

అలాగే కోల్‌కతా – వైజాగ్ మధ్య ఎయిర్ ఏషియా నడుపుతున్న విమానం కూడా రద్దయ్యింది. నిర్వహణ భారం అధికంగా ఉండటం వల్లే ఈ రెండు సంస్థలు విశాఖకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అటు స్పైస్‌జెట్ కూడా విశాఖ-ఢిల్లీ- విశాఖ సర్వీసులను వారం రోజుల పాటు నిలిపివేసింది. కాగా, మార్చి 28 నుంచి విశాఖ – బెంగళూరు, విశాఖ- హైదరాబాద్ సర్వీసులకు అనుమతులు ఇవ్వాలని పలు దేశీయ విమానయాన రంగ సంస్థలు ఏఏఐకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మాత్రం ఇంకా అనుమతి రావాల్సి ఉందని సమాచారం.