Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?

|

Mar 04, 2020 | 2:22 PM

Virat Kohli Retirement: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భారాన్ని దించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కివీస్ టూర్‌లో టీమిండియా ఘోర పరాజయాలను ఎదురుకున్న సంగతి తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీసేన వైట్‌వాష్ చవి చూసింది. అంతేకాకుండా ఈ టూర్‌లో కోహ్లీ పూర్తిగా విఫలం కావడం జట్టును బాగా కలవరపెట్టిందని చెప్పాలి. అటు కోహ్లీ ఆటతీరు, ప్రవర్తనపై కూడా సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా […]

Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
Follow us on

Virat Kohli Retirement: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భారాన్ని దించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కివీస్ టూర్‌లో టీమిండియా ఘోర పరాజయాలను ఎదురుకున్న సంగతి తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీసేన వైట్‌వాష్ చవి చూసింది. అంతేకాకుండా ఈ టూర్‌లో కోహ్లీ పూర్తిగా విఫలం కావడం జట్టును బాగా కలవరపెట్టిందని చెప్పాలి.

అటు కోహ్లీ ఆటతీరు, ప్రవర్తనపై కూడా సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే కోహ్లీ కొంతకాలంగా రెస్ట్ లేకుండానే టూర్స్ చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడూ టీ20లకు విశ్రాంతి తీసుకుంటూ.. తన శ్రమను తగ్గించుకుంటున్నారు. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని లాంటి సీనియర్ ఆటగాడు కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో కోహ్లీపై అదనపు భారం పడిందని చెప్పవచ్చు.

వరుస షెడ్యూల్స్, ఐపీఎల్ ఆటగాళ్లకు తీరిక లేకుండా చేస్తోంది. ఈ తరుణంలోనే కోహ్లీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టులు, వన్డేలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువ అవుతోందని.. తాము తీరికలేని షెడ్యూల్స్ చేయడం వల్ల అలిసిపోతున్నామని బహిర్గతంగా కోహ్లీ వెల్లడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పలువురు మాజీలు కూడా అతన్ని ఏదొక ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని సూచించారు. కాగా, టీ20ల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.. అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించి 4 ట్రోఫీలను సాధించిన విషయం విదితమే.

For More News: 

ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…

కోనసీమలో కరోనా కలకలం..!

‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…

ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..

సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!

సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!