అసద్ జీ.. డ్యాన్స్ అదుర్స్..! మీరు చూశారా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. ఔరంగాబాద్‌లోని పైథాన్ గేట్ వద్ద ర్యాలీ ముగియగానే వేదిక దిగి వెళ్తూ డ్యాన్స్ చేశారు.  ‘మియా భాయ్’ పాటకు డ్యాన్స్ చేయడంతో సభకు హాజరైనవారు కేరింతలు కొట్టారు. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి. వేడి వేడి రాజకీయ ప్రసంగాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఎంఐఎం అధినేత సరదాగా కనిపించడం చాలా అరుదు. వాస్తవానికి ఓవైసీ […]

అసద్ జీ.. డ్యాన్స్ అదుర్స్..! మీరు చూశారా?

Updated on: Oct 19, 2019 | 12:58 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. ఔరంగాబాద్‌లోని పైథాన్ గేట్ వద్ద ర్యాలీ ముగియగానే వేదిక దిగి వెళ్తూ డ్యాన్స్ చేశారు.  ‘మియా భాయ్’ పాటకు డ్యాన్స్ చేయడంతో సభకు హాజరైనవారు కేరింతలు కొట్టారు. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

వేడి వేడి రాజకీయ ప్రసంగాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఎంఐఎం అధినేత సరదాగా కనిపించడం చాలా అరుదు. వాస్తవానికి ఓవైసీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి యాంగిల్‌ను ఆయన సన్నిహితులు కూడా చూసి ఉండరు. ఒక్కసారిగా ఇలాంటి పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చే సరికి అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us