
US President Trump Live Updates : వాషింగ్టన్లో ‘సేవ్ అమెరికా ర్యాలీ’కి విశేష స్పందన లభించింది. ఈ ర్యాలీకి భారీగా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా అభిమానులు తరలివచ్చారు. వైట్ హౌస్ సమీపంలోని ఎలిప్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, ట్రంప్ అభిమానలు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు.
వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న బహిరంగ సభకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ‘సేవ్ అమెరికా ర్యాలీ’కి తరలివస్తున్న తమ మద్దతుదారులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.