‘అవును..13 మర్డర్లు చేశాను..ఇంకా..’ అమెరికన్ సీరియల్ కిల్లర్ కథనం

అమెరికాలో 1970, 1980 ప్రాంతాల్లో అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడ్డానని  అంగీకరించాడు ప్రస్తుతం 74 ఏళ్ళ వయసున్న సీరియల్ కిల్లర్. మాజీ పోలీసు అయిన ఇతని పేరు జోసెఫ్ జేమ్స్ డీయాంగెలో జూనియర్. ఆనాడు తననేరాలతో శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా..

'అవును..13 మర్డర్లు చేశాను..ఇంకా..' అమెరికన్ సీరియల్ కిల్లర్ కథనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2020 | 1:25 PM

అమెరికాలో 1970, 1980 ప్రాంతాల్లో అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడ్డానని  అంగీకరించాడు ప్రస్తుతం 74 ఏళ్ళ వయసున్న సీరియల్ కిల్లర్. మాజీ పోలీసు అయిన ఇతని పేరు జోసెఫ్ జేమ్స్ డీయాంగెలో జూనియర్. ఆనాడు తననేరాలతో శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర నగరాలను హడలెత్తించాడు. తను 13 హత్యలు చేశానని, అత్యాచారాలకు, కిడ్నాపింగ్ లకు పాల్పడ్డానని కోర్టులో ఒప్పుకున్నాడు. లాస్ ఏంజిల్స్ లో ఇతడిని కోర్టు సోమవారం విచారించింది. జోసెఫ్ చేసిన కిరాతకాలకు గాను ఇతడిని ‘ గోల్డెన్ స్టేట్ కిల్లర్’ అని ఆ రోజుల్లో అభివర్ణించారట. సుమారు రెండు దశాబ్దాల పాటు ఇతడు  చేసిన ఘోరాలకు లెక్క లేదని, పోలీసుల కళ్ళు గప్పి చాకచక్యంగా పారిపోయేవాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు జోసెఫ్ ‘అవును’, ‘కాదు’, ఒప్పుకుంటున్నా’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు.  ఇన్ని నేరాలు చేసిన ఇతని వయసు రీత్యా ఇతనికి మరణశిక్ష పడదని,  పెరోల్ లేకుండా యావజ్జీవ శిక్ష పడుతుందని కోర్టు వర్గాలు తెలిపాయి. వియత్నాం కు చెందిన ఈ సీరియల్ కిల్లర్.. తన నేరాలకు ఇప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపాన్నీ ప్రకటించలేదు. 2018 లో ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడ్ని కోర్టులో ఏ నాడో విచారించవలసి ఉండగా కరోనా వైరస్ కారణంగా జాప్యం జరిగిందని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. జోసెఫ్ సుమారు 50 రేప్ లకు పాల్పడ్డాడని, 1975 నుంచి ప్రారంభమైన ఇతడి కిరాతకాలు 1986 వరకు కొనసాగాయని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. 86 లో పద్దెనిమిదేళ్ల యువతిపై హత్యాచారం చేయడంతో పోలీసులకు పట్టుబడ్డాడు.

Latest Articles
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు