రాష్ట్రంలోని రహదారులకు మహార్థశ.. భారతమాల పథకం కింద రోడ్ల అభివృద్ధి.. ఈనెల 21న కేంద్రమంత్రి గడ్కరీ శ్రీకారం

తెలంగాణలో జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో కొన్ని రహదారులను ప్రారంభిస్తారని, మరికొన్నింటిని భూమిపూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని రహదారులకు మహార్థశ.. భారతమాల పథకం కింద రోడ్ల అభివృద్ధి.. ఈనెల 21న కేంద్రమంత్రి గడ్కరీ శ్రీకారం
Follow us

|

Updated on: Dec 17, 2020 | 5:12 PM

తెలంగాణలో జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో కొన్ని రహదారులను ప్రారంభిస్తారని, మరికొన్నింటిని భూమిపూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా భారతమాల పేరుతో జాతీయ రహదారుల అభివ‌ృద్ధి కార్యక్రమం చేపట్టింది కేంద్ర సర్కార్. 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను భారత మాల పరియోజన – I అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అదనంగా, భారత మాల పరియోజన – II కింద 750 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.13,100 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యాయన్నారు. కాగా, ఇప్పటికే పూర్తైన ఆరు ప్రాజెక్టులను జాతీయ అంకితం చేస్తుండగా, మరో 8 కొత్త ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రి గడ్కారీ భూమి పూజ చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్, 21న కేంద్ర మంత్రి గడ్కరీ వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.