శాంతి చర్చలంటూ ఆయుధాలు పోగేసుకుంటున్న పాకిస్తాన్, ఇంటెలిజెన్స్ సంస్థల వెల్లడి

ఇండియాతో ఓ వైపు  శాంతి చర్చలంటూ మరోవైపు పాకిస్తాన్ రహస్యంగా ఆయుధాలను సమీకరించుకుంటున్నదని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాత యుధ్ధ ట్యాంకులు, హెవీ మెషిన్ గన్లు తదితరాల మరమ్మతులను....

శాంతి చర్చలంటూ ఆయుధాలు పోగేసుకుంటున్న పాకిస్తాన్, ఇంటెలిజెన్స్ సంస్థల వెల్లడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2021 | 4:56 PM

ఇండియాతో ఓ వైపు  శాంతి చర్చలంటూ మరోవైపు పాకిస్తాన్ రహస్యంగా ఆయుధాలను సమీకరించుకుంటున్నదని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాత యుధ్ధ ట్యాంకులు, హెవీ మెషిన్ గన్లు తదితరాల మరమ్మతులను ఈ నెల 21 కల్లా పూర్తి చేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించినట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. వివిధ  రకాల మందుగుండు సామగ్రిని తిరిగి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని నిపుణుల బృందాలను పలు కంటోన్మెంట్లకు పంపిందట. ఉదాహరణకు ఖిరియన్, ముల్తాన్, మూరి వంటి కంటోన్మెంట్లకు వీరు అప్పుడే బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది. ఈ ప్రాంతాల్లో అప్పుడే జోరుగా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఫాస్ట్ ట్రాక్ బేసిస్ పై సౌతాఫ్రికా, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సంస్థలు పేర్కొన్నాయి.

తన టీ-20 ట్యాంకులకు అనువైన 12.7 ఎంఎం స్నిఫర్ రైఫిల్స్ ని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ సంస్థ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. రష్యా నుంచి మినీ యూఏవీ ఎస్-250 శకటాలను కూడా కొంటున్నదట.. వీటి రేంజి 25 నుంచి 50 కి.మీ. ఉందని సమాచారం. చైనా కూడా పాకిస్తాన్ కు అండగానే  ఉంటోంది. తన వైమానిక దళం కోసం కొత్త రాడార్ సిస్టం కొనుగోలుకు పాక్ ప్రభుత్వం చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు స్పష్టమైంది. దీని రేంజి 100 కి.మీ. నుంచి 200 కి.మీ. పొరుగునున్న దేశంతో  వార్ కి సిద్ధంగా ఉండాల్సిందిగా పాక్ నేవీ చీఫ్ అమ్ జాద్ ఖాన్ నియాజీ గత నెల 23 న తమ కమాండర్లను ఆదేశించినట్టు చెబుతున్నారు. ఇంకా ఇలాగే సీక్రెట్ గా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి నానా పాట్లు  పడుతోందని తెలుస్తోంది.

ఇటీవల భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హాట్ లైన్ సౌకర్యం ద్వారా శాంతి చర్చలు జరుగుతుండాలని ఉభయదేశాల నేతలూ నిర్ణయించిన విషయం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉభయులూ గౌరవించుకోవాలని, వాటికి కట్టుబడి ఉండాలని కూడా తీర్మానించారు. కానీ పాకిస్తాన్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తన ఆయుధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.

మరిన్ని ఎక్కడ చదవండి:

Beauty Tips : నల్లటి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే తక్కువ టైంలో మీ అందానికి మెరుగులు దిద్దుకోండిలా..

Petrol price hike memes: క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’కి 5 లీటర్ల పెట్రోల్.. వైరల్‌గా మారిన ఫోటో

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..