Fixed Deposit: ఎఫ్‌డీల్లో పెట్టుబడితో ఆ బ్యాంకుల్లో నమ్మలేని వడ్డీ.. ఏకంగా 8.1 శాతం అందజేత

ఎఫ్‌డీలకు సంబంధించిన మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడిపై మంచి వడ్డీ రేటుతో కూడా హామీ మొత్తాన్ని ఆయా బ్యాంకులు మీకు చెల్లిస్తాయి.  ముందుగా నిర్ణయించిన సమయానికి నిర్ణీత వడ్డీ రేటుతో సెట్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఎఫ్‌డీ మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రతి ఆర్థిక సంస్థకు సంబంధించిన నిబంధనలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును ప్రభావితం చేయవచ్చు.

Fixed Deposit: ఎఫ్‌డీల్లో పెట్టుబడితో ఆ బ్యాంకుల్లో నమ్మలేని వడ్డీ.. ఏకంగా 8.1 శాతం అందజేత
Cash
Follow us

|

Updated on: Apr 07, 2024 | 7:40 PM

స్థిర డిపాజిట్లు అస్థిర మార్కెట్ అనుసంధాన పెట్టుబడులకు విరుద్ధంగా మూలధన సంరక్షణకు హామీ ఇస్తాయి.ఈ ఫీచర్ సీనియర్ సిటిజన్‌లు, రిస్క్ ఫేస్ లేని వ్యక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎఫ్‌డీలకు సంబంధించిన మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడిపై మంచి వడ్డీ రేటుతో కూడా హామీ మొత్తాన్ని ఆయా బ్యాంకులు మీకు చెల్లిస్తాయి.  ముందుగా నిర్ణయించిన సమయానికి నిర్ణీత వడ్డీ రేటుతో సెట్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఎఫ్‌డీ మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రతి ఆర్థిక సంస్థకు సంబంధించిన నిబంధనలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీలపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ రేటును అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

  • యాక్సిస్ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 17 నెలల నుంచి 18 నెలల తక్కువకు అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.70 శాతం నుంచి 7.20 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • బంధన్ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 500 రోజుల వరకూ అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 7.45 శాతం నుంచి 7.85 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • డీసీబీ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 25 నెలల నుంచి 26 నెలల తక్కువకు అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 7.15 శాతం నుంచి 8.00 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • ఫెడరల్ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 500 రోజుల వరకు అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.80 శాతం నుంచి 7.25 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 18 నెలల నుంచి 21 నెలల తక్కువకు అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.60 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. 
  • ఐసీఐసీ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 15 నెలల నుంచి 24 నెలల తక్కువకు అందుబాటులో ఉంది.
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి 500 రోజుల వరకూ అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.50 శాతం నుంచి 8.00 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు కాల వ్యవధి రెండు సంవత్సరాల వరకూ అందుబాటులో ఉంది. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.80 శాతం నుంచి 7.25 వడ్డీ రేటును పొందవచ్చు. 
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే అత్యధిక వడ్డీ రేటు 400 రోజుల వరకూ అందుబాటులో ఉంది. ఈ పథకాన్ని ఎస్‌బీఐ అమృత్ కలశ్‌గా పేర్కొంటారు. అలాగే ఈ సమయం 1 నుంచి మూడు సంవత్సరాలకు 6.80 శాతం నుంచి 7.00 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles