ప్రేమకోసం పులి చేసిన సాహసం.. నెటిజన్లు ఫిదా!

పక్షులు మరియు జంతువులు వలసపోతాయని తెలుసు. కానీ తోడును వెతుక్కుంటూ ఓ పులి చేసిన ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేల కిలోమీటర్ల పాటు ఈ ప్రేమ ప్రయాణం సాగింది.

ప్రేమకోసం పులి చేసిన సాహసం.. నెటిజన్లు ఫిదా!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 8:55 PM

పక్షులు మరియు జంతువులు వలసపోతాయని తెలుసు. కానీ తోడును వెతుక్కుంటూ ఓ పులి చేసిన ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేల కిలోమీటర్ల పాటు ఈ ప్రేమ ప్రయాణం సాగింది. పర్వీన్ కాస్వాన్ అనే అటవీ శాఖ అధికారి ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, రహదారులు, అడవులు, పొలాలు దాటుకుంటూ ఈ ప్రయాణం సాగిందని తెలిపారు. జీపీఎస్‌ ట్రాకర్ల ఆధారంగా పులి కదలికలపై నిఘాపెట్టామన్నారు. పగటి పూట పులి విశ్రమించేదని, రాత్రి వేళల్లో ప్రయాణం కొనసాగించేదని తెలిపారు.

అయితే.. ధ్యానగంగా అడవిలో దాని ప్రయాణానికి ముగింపు పడిందన్నారు. పులి ఏ మార్గంలో ప్రయాణించిందో తెలిపే ఓ మ్యాప్‌ను కూడా పోస్ట్ చేశారు. సహజంగానే ఈ సుదీర్ఝ ప్రయాణం నెటిజన్లను కదిలించింది. అయితే కొంత మంది మాత్రం ఈ ఘటన ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. స్వస్థలంలో ఉన్న పులులతో పోటిపడలేకనే పులి ఇలా చేసిందని కొందరంటే..బంధువుల పోరు తట్టుకోలేక ఇలా పారిపోయిందని మరి కిందరు కామెంట్లు పెట్టారు. మనుషుల లవ్‌స్టోరీల కంటే ఈ ప్రేమప్రయాణం మరింత గొప్పగా ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు.

[svt-event date=”05/03/2020,8:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]