గుండె భేషుగ్గా ఉండాలంటే.. ఏం తినాలి.?

ఉరుకులు పరుగులు జీవితంలో ఎప్పుడు చూసిన ఏదో ఒక టెన్షన్‌ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు తరచూ గుండె సంబంధిత రోగాలు రావడం సహజం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే గుండెపోటు, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన రక్త నాళల్లో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే.. ఇక దానితో గుండెకు రక్తం సరఫరా సరిగ్గా అందకపోవడంతో.. హార్ట్ స్ట్రోక్స్ తప్పవు. ఇక వీటి […]

గుండె భేషుగ్గా ఉండాలంటే.. ఏం తినాలి.?
Ravi Kiran

|

Nov 06, 2019 | 4:54 PM

ఉరుకులు పరుగులు జీవితంలో ఎప్పుడు చూసిన ఏదో ఒక టెన్షన్‌ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు తరచూ గుండె సంబంధిత రోగాలు రావడం సహజం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే గుండెపోటు, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన రక్త నాళల్లో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే.. ఇక దానితో గుండెకు రక్తం సరఫరా సరిగ్గా అందకపోవడంతో.. హార్ట్ స్ట్రోక్స్ తప్పవు. ఇక వీటి నుంచి బయటపడడానికి డాక్టర్లు అనేక డైట్‌లను సూచిస్తారు. అలాంటి పలు డైట్స్‌ను ఇప్పుడు చూద్దాం..
తాజాగా ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం వరుసగా రెండో ఏడాది కూడా మెడిటేరియన్ డైట్ వరుసగా టాప్ ప్లేస్‌లో ఉంది. ఉడికించిన పదార్ధాలు, సీఫుడ్, తృణ ధాన్యాలు వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. సరిగ్గా ఈ డైట్‌ను పోలినటువంటి ఒక డైట్ గురించి తెలుసుకుందాం.. అదేంటంటే ‘ది ఓర్నిష్ డైట్’
యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ డీన్ ఓర్నిష్ ఈ డైట్‌ను రూపొందించారు. ఈ డైట్ వల్ల గుండె జబ్బులు మన దరికి అసలు రావు. ఇప్పటికే చాలామంది నిపుణులు ఈ డైట్ ఫాలో అవుతూ.. ప్రజలందరినీ కూడా ఫాలో అవ్వాలని సూచించారు.
ఓర్నిష్ డైట్ అంటే ఏమిటీ…?
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ డైట్ తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. శుద్ధి చేసిన పిండి పదార్ధాలు, జంతు ప్రోటీన్ ఉండటమే కాకుండా కార్బో‌హైడ్రేట్స్ మోస్తరుగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినడం వల్ల తక్కువ కొవ్వు ఉత్పత్తి చెందుతుంది. పోషణ విలువలతో పాటు ఈ డైట్ చక్కని వ్యాయామాలను కూడా సూచిస్తుంది. యోగా, శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటి వాటితో మానసికంగా కూడా దృడంగా ఉండేలా ఈ ప్రణాళిక తోడ్పడుతుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu