తిరుపతిలో యాచకుల ముసుగులో న్యాక్‌గా దొంగతనం.. బండారం బయటపెట్టిన నిఘా నేత్రం..

తిరుపతిలో యాచకుల ముసుగులో న్యాక్‌గా దొంగతనం.. బండారం బయటపెట్టిన నిఘా నేత్రం..

అడుక్కోవడానికి వచ్చినట్టు షాపులోకి వస్తారు..తరువాత అంతా క్యాష్‌ కౌంటర్‌పైనే వారి కన్నుంటుంది.

Balaraju Goud

|

Nov 13, 2020 | 12:30 PM

తిరుపతి బిచ్చగత్తెల ముసుగులో మహిళల దొంగతనాలు ఎక్కువయ్యాయి. యాచకుల ముసుగులో వచ్చి ఎంతో న్యాక్‌గా దొంగతనం చేస్తున్నారు. అడుక్కోవడానికి వచ్చే మహిళలు అప్పన్నంగా షాపుల్లోని నగదు, వస్తువులను కాజేస్తున్నారు.

ఏమీ తెలియని వారిలా ఎంట్రీ ఇస్తారు.. అడుక్కోవడానికి వచ్చినట్టు షాపులోకి వస్తారు..తరువాత అంతా క్యాష్‌ కౌంటర్‌పైనే వారి కన్నుంటుంది. అంతలో షాపు యాజమానిని ముగ్గులోకి దించి అతన్ని చుట్టుముడతారు… కప్పుకున్న రగ్గులు అతనికి అడ్డంగా పెడతారు… ఇంతలో ఓ బుల్లి దొంగ అచ్చం సినీ ఫక్కీలో బల్లకిందకు దూరి చేతివాటం ప్రదర్శిస్తుంది… అంతా అయిపోయాక.. షాపు ఓనర్‌ ధర్మం చేసిన డబ్బులు తీసుకుని అక్కడ నుంచి మెల్లగా జారుకుంటారు.. ఇందుకు సంబంధించి దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

దానం చేయండి అంటూ పసిపిల్లలను ఎత్తుకుని షాపుల్లోకి వెళ్లి రెండున్నర లక్షలు కొట్టేశారు. ఇదంతా చేస్తున్నది స్ధానిక మహిళలు కాదు…రాజస్థాన్‌ చోరులు.గత కొంత కాలంగా చిన్న పిల్లలతో దొంగతనం చేయిస్తోంది ఈ ముఠా…నగరంలో లీలామహన్ వద్ద లక్ష్మి వెంకటేశ్వర స్టీల్ షాపులో సిబ్బందికి మస్కా కొట్టి… ర్యాక్ లోని రెండున్నర లక్షలు రూపాయలు కొట్టేశారు. తిరుపతి కేంద్రం విచ్చలవిడిగా జరుగుతున్న ఈ తరహా చోరీలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu