కొత్త బార్లకు స్పందన నిల్.. ఒక్కటీ రాలేదు..!

ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన కొత్త బార్లకు.. మద్యం వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. లైసెన్స్‌లకు ఆహ్వానం పలుకుతూ నోటీసులు జారీ చేసి.. ఐదు రోజులవుతోన్నా.. ఇప్పటికీ.. ఒక్క దరఖాస్తు కూడా.. రాలేదు. పాత బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ.. కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని.. జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. బార్‌ లైసెన్స్ కావాలంటే.. పది లక్షల రూపాయలు కట్టాలి. అది […]

కొత్త బార్లకు స్పందన నిల్.. ఒక్కటీ రాలేదు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:37 PM

ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన కొత్త బార్లకు.. మద్యం వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. లైసెన్స్‌లకు ఆహ్వానం పలుకుతూ నోటీసులు జారీ చేసి.. ఐదు రోజులవుతోన్నా.. ఇప్పటికీ.. ఒక్క దరఖాస్తు కూడా.. రాలేదు. పాత బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ.. కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని.. జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

బార్‌ లైసెన్స్ కావాలంటే.. పది లక్షల రూపాయలు కట్టాలి. అది కూడా.. లాటరీ పద్ధతిలో.. ఒకవేళ లాటరీలో పేరు రాకుంటే.. డబ్బు వెనక్కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో.. ఇదేంటిరా బాబూ అంటూ.. మద్యం దుకాణాదారులు తలలు పట్టుకున్నారు. అయితే.. కొంతమంది బార్ల దుకాణాదారులు.. ఈ బార్ల లైసెన్స్ రద్దును వ్యతిరేకిస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. గడువుకు ముందే లైసెన్సులు రద్దు చేశారని.. అందులోనూ.. లాటరీలో షాపు రాకపోతే.. కట్టిన సొమ్ము వెనక్కి రాకపోవడంతో.. తమపై భారీగా భారం పడుతుందని కోర్టుకు విన్నవించిన మద్యం దుకాణాదారులు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 18కి విచారణను వాయిదా వేసింది.