నేడు తెలంగాణ కెబినేట్ భేటీ

నేడు తెలంగాణ కెబినేట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరగనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలుపడానికి ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశం జరుపనున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పురపాలనను సమగ్ర ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నూతన అర్బన్ పాలసీని రూపొందించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్ నగర కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టాలను తెస్తున్నారు. హెచ్‌ఎండీఏతోపాటు నగర పాలక సంస్థల […]

నేడు తెలంగాణ కెబినేట్ భేటీ
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 9:21 AM

నేడు తెలంగాణ కెబినేట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరగనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలుపడానికి ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశం జరుపనున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పురపాలనను సమగ్ర ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నూతన అర్బన్ పాలసీని రూపొందించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్ నగర కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టాలను తెస్తున్నారు. హెచ్‌ఎండీఏతోపాటు నగర పాలక సంస్థల అభివృద్ధి మండళ్ల చట్టాన్ని సవరించి కొత్త చట్టం రూపొందించారు. వీటికి మంత్రివర్గం నేడు ఆమోదం తెలుపనుంది.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలకు 4 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి, శాంతికి భంగం కల్గించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.