గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు

TV9 Telugu

18 May 2024

డయాబెటీస్‌, గుండె జబ్బులకు జీవితాంతం మందులు వాడాలి. అయితే ఈ మందులైన ఖర్చు భారీగా ఉన్న కారణంగా కొనడం కష్టంగా మారింది.

డయాబెటీస్‌, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మందుల ధరలను సగానికి పైగా తగ్గించింది.

సామాన్యులకు తలకు మించిన భారం, చాలా ఖర్చు చేయాల్సిన 41 రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఒళ్లు నొప్పులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్స్, అలర్జీల మందులు, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్స్‌ ధరలు దిగి రానున్నాయి.

తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) నోటిఫికేషన్ విడుదల చేసింది.

భారత్‌లో 10 కోట్ల మందికి పైగా మధుమేహ బాధితులున్నారు. మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి.

డయాబెటిస్‌కు వాడే డపాగ్లిఫోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ప్రస్తుతం రూ. 30 ఉండగా, ఇప్పుడు రూ. 16కు దిగివచ్చింది.

డయాబెటిస్‌ నియంత్రణ, గుండె జబ్బులతో పాటు మరో ఆరు రకాల వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు కూడా భారీగా తగ్గాయి.