నూతన సచివాలయానికి రేపే భూమిపూజ

తెలంగాణ నూతన సచివాలయం,అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ రేపు ఉదయం భూమి పూజ,శంకుస్ధాపనలు చేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే  డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న గార్డెన్‌లో భూమిపూజ చేయనున్నారు. ఆతర్వాత ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది . ఈ రెండు నిర్మాణాలను అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, […]

నూతన సచివాలయానికి రేపే భూమిపూజ
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:00 PM

తెలంగాణ నూతన సచివాలయం,అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ రేపు ఉదయం భూమి పూజ,శంకుస్ధాపనలు చేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే  డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న గార్డెన్‌లో భూమిపూజ చేయనున్నారు. ఆతర్వాత ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది .

ఈ రెండు నిర్మాణాలను అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే పాత భవనాన్ని ఒకేసారి కూల్చివేయకుండా విడతల వారీగా కూల్చివేసి పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట ఏ, బీ, సీ బ్లాక్‌లలోని కార్యాలయాలను ఎల్, జే, డీ బ్లాక్‌లకు తరలించి.. ఏ,బీ,సీ,కే బ్లాక్‌లను కూల్చివేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నూతన సచివాలయం భారీ ఎత్తున నిర్మితమవుతున్న దృష్ట్యా అక్కడున్న భారీ వృక్షాలను వేరే చోట తిరిగి పాతిపెట్టేవిధంగా అధికారులు నిర్ణయించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..