కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే..?

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  శనివారం రాత్రి 8గంటల వరకు 57,308 మందికి కరోనా నిర్థారణ టెస్టులు చేయగా 622 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే..?
Follow us

|

Updated on: Dec 06, 2020 | 9:39 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  శనివారం రాత్రి 8గంటల వరకు 57,308 మందికి కరోనా నిర్థారణ టెస్టులు చేయగా 622 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,73,341కి చేరింది. శనివారం కరోనాతో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌‌లో పేర్కొంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1472కి చేరింది. కరోనాబారి నుంచి శనివారం 993 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,63,744కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,125 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,116 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 57,79,490కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 104 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో డెత్ రేటు 0.53 శాతం ఉండగా, రికవరీ రేటు 96.48 శాతానికి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 104 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 55 , మేడ్చల్ మల్కాజిగిరిలో 51 కేసులు వెలుగుచూశాయి.

Also Read :

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినవారిలో 25 మందికి నేర చరిత్ర..వివరాలు విడుదల చేసిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

ఏటా 10 రోజులు ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

Latest Articles