కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ..!

విద్యుత్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు తెస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి లేఖ రాశారు. ప్ర‌తిపాదిత విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు-2020పై రాష్ట్రాలు అభిప్రాయాల‌ను తెలుపాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం కోరిన నేప‌థ్యంలో ప్ర‌ధానికి లేఖ రాసిన సీఎం.

కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ..!

విద్యుత్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు తెస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి లేఖ రాశారు. ప్ర‌తిపాదిత విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు-2020పై రాష్ట్రాలు అభిప్రాయాల‌ను తెలుపాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం కోరిన నేప‌థ్యంలో ప్ర‌ధానికి లేఖ రాసిన సీఎం స‌ద‌రు బిల్లుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ‌కేంద్రం ప్ర‌తిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లును కేంద్రం ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు త‌మ‌కున్న‌ అధికారాలు కోల్పోయేలా విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు ఉన్న‌దని సీఎం కేసీఆర్‌ విమ‌ర్శించారు. జాతీయ పున‌రుత్పాద‌క శ‌క్తి పాల‌సీలో మార్పులు చేసే ముందు రాష్ట్రాల‌ను సంప్ర‌దిచాల్సిన అస‌వ‌రం ఉందన్నారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉంటాయని, వాటికి అనుగుణంగా మార్పులు చేసుకునే అవ‌కాశం రాష్ట్రాల‌కు కల్పించాలని ఆయ‌న‌ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌తిపాదిత విద్యుత్ స‌వ‌ర‌ణ‌ బిల్లుతో ప్ర‌స్తుతం స‌బ్సిడీ పొందుతున్న రైతులు, గృహ వినియోగ‌దారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని లేఖ‌లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోసారి విద్యుత్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ బిల్లుపై పునరాలోచించాలని కోరారు.