పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ఏపీలో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు.. పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ...

పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు
Follow us

|

Updated on: Nov 08, 2020 | 4:14 PM

TDP leader’s controversial flexes on local polls: ఏపీలో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు.. పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ కోరుతోంది. అదే సమయంలో ప్రభుత్వ విధానాలతో పని లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ మద్దతిస్తోంది. అలాంటి పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దంటూ విజయవాడ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడో టీడీపీ నాయకుడు.

కాట్రగడ్డ బాబు నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహించవద్దంటూ ఆయన ఫ్లెక్సీలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ ఫ్లెక్సీలో ప్రస్తావించారు. పంథాలకు పోయి స్థానిక ఎన్నికలు పెట్టవద్దన్నారు. అయితే.. టీడీపీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరింది.

పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఇపుడు ఏపీవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై కాట్రగడ్డ బాబును సంప్రదించింది టీవీ9. ‘‘ స్థానిక ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం.. నా అభిప్రాయాన్ని నేను తెలిపాను.. పార్టీకి వ్యతిరేకంగా వెళుతున్నానని అంటున్నారు.. కానీ నేను ఉన్న విషయం మాట్లాడాను.. నాకు అసంతృప్తి ఏమి లేదు.. నాకు పదవులు ముఖ్యం కాదు.. ’’ అంటూ వ్యాఖ్యానించి తన ధోరణిపై మరింత ఆసక్తి పెంచారు కాట్రగడ్డ బాబు.

ALSO READ: శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్

ALSO READ: కేదార్‌నాథ్ చేరిన సంతోష్ సంకల్పం