సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట, హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా టెస్టుల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది...

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట, హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Follow us

|

Updated on: Dec 16, 2020 | 2:37 PM

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా టెస్టుల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రోజుకు 50 వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలన్న ఆదేశాలు పాటించలేదని తెలంగాణ హైకోర్టు, ప్రభుత్వానికి కోర్టు ధిక్కారణ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ధిక్కరణ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అంతేకాదు, కరోనా నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కూడా అత్యున్నత న్యాయస్థానానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.