కొన్ని సంఘ విద్రోహ శక్తుల పనే ఇది ! ఢిల్లీ ఘర్షణలపై సంయుక్త కిసాన్ మోర్చా స్పందన

కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా నిరసన ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగానే మంగళవారం ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున హింసాత్మక వాతావరణం  ఏర్పడిందని..,

  • Umakanth Rao
  • Publish Date - 4:15 pm, Tue, 26 January 21
కొన్ని సంఘ విద్రోహ శక్తుల పనే ఇది ! ఢిల్లీ ఘర్షణలపై సంయుక్త కిసాన్ మోర్చా స్పందన

కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా నిరసన ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగానే మంగళవారం ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున హింసాత్మక వాతావరణం  ఏర్పడిందని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. నిజానికి తాము శాంతియుతంగా తమ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలనుకున్నామని, కానీ ఈ శక్తుల కారణంగా పరిస్థితి చెయ్యి దాటిపోయిందని వారన్నారు. అవాంఛనీయ ఘటనలను తాము ఖండిస్తున్నామని, మళ్ళీ ఈ విధమైనవి జరగకుండా చూస్తామని వారన్నారు. ఈ అల్లర్లలో కొందరు రైతులు,  పోలీసులు కూడా గాయపడడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. అటు- ఘాజీపూర్ బోర్డర్లో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. నగరంలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది.