అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు ఈ నెల 17వ తేదీ లోపు వాదనలు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడిస్తానని తెలిపింది. ఇక రంజన్‌ గొగోయ్‌ అదే రోజు రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. తుది […]

అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 7:57 AM

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు ఈ నెల 17వ తేదీ లోపు వాదనలు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పును నవంబరు 17వ తేదీన వెల్లడిస్తానని తెలిపింది. ఇక రంజన్‌ గొగోయ్‌ అదే రోజు రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు.

తుది తీర్పుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అయోధ్యలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ 37 సార్లు అయోధ్య వివాదం పై సుప్రీంలో వాదోపవాదనలు జరిగాయి. అయినప్పటికీ కేసులో పురోగతి లేదు. దీంతో నవంబర్ 17వ తేదీ నాటికి ఈ వివాదం పై తీర్పు ప్రకటిస్తామని.. రంజన్ గగోయ్ డెడ్ లైన్ పెట్టారు. ఇక నేటి నుంచి మొదటి మూడు రోజులు హిందూ సంఘాలు, ముస్లిం కమిటీలు తమ వాదనలను వినిపించే అవకాశం కల్పించింది. వీరి వాదనలు విన్న తర్వాత గురువారం తుది విచారణను నిర్వహిస్తామని రంజన్ గగోయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి తీర్పు ప్రకటించినా అన్ని వర్గాల ప్రజలు స్వాగతించడానికి సిద్దంగా ఉండాలని అధికారులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ