కశ్మీర్​లో ‘4జీ’ సేవ‌ల‌కు నో చెప్పిన సుప్రీం…కమిటీ ఏర్పాటు

కశ్మీర్​లో '4జీ' సేవ‌ల‌కు నో చెప్పిన సుప్రీం...కమిటీ ఏర్పాటు

జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా‌ పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వ‌ర్యంలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.​ ఈ కమిటీలో జమ్ము కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి, సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్​లో 4జీ సేవలు తిరిగి స్టార్ట్ చెయ్యాలంటూ… ఫౌండేషన్ ఫర్ మీడియా […]

Ram Naramaneni

|

May 11, 2020 | 3:35 PM

జమ్ముకశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా‌ పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వ‌ర్యంలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.​ ఈ కమిటీలో జమ్ము కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి, సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్​లో 4జీ సేవలు తిరిగి స్టార్ట్ చెయ్యాలంటూ… ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్, షోయబ్​ ఖురేషి, జమ్ము కశ్మీర్ ప్రైవేట్ పాఠశాలల సంఘం దాఖలు చేసిన పిటిషిన్లపై అత్య‌న్న‌త‌ న్యాయస్థానం నేడు(సోమ‌వారం) విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎన్​.వి.రమణ, జస్టిస్ ఆర్​.సుభాష్​రెడ్డి, జస్టిస్​ బి.ఆర్.గవాయ్​ల త్రిసభ్య ధర్మాసనం… జమ్ము కశ్మీర్​లో 4జీ ఇంట‌ర్నెట్ సేవలు పునరుద్ధరించేందుకు ప‌ర్మిష‌న్ నిరాకరించింది. జాతీయ భద్రత, మానవ హక్కుల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu