ఈ సారి కూడా విజయం ఆయనదే…స్పందించిన సంజయ్ దత్ భార్య

ఈ సారి కూడా విజయం ఆయనదే...స్పందించిన సంజయ్ దత్ భార్య

సంజయ్ దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యతా దత్ స్పందించారు. భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డించారు. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా వ్యక్తం చేశారు...

Sanjay Kasula

|

Aug 12, 2020 | 7:21 PM

సంజయ్ దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యతా దత్ స్పందించారు. భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డించారు. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్‌ ఎప్పుడూ పోరాట యోధుడేనని, ఈ సారి కూడా విజయం ఆయనదే అవుతుందన్నారు. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలని కోరారు. పాజిటివిటీని పంచాల‌ని మాన్య‌త కోరారు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు.

‘సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ విషెస్‌ తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదన నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌దత్‌ ఫ్యాన్ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కడే.. దయచేసి రూమర్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. మీ తోడు మాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’ అని మాన్యత ‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే  ఇలా ప్రజలకు, అభిమానులకు కోరారు. ఎక్కడ కూడా సంజయ్ దత్  నిజంగానే లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా.. లేదా.. అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.  క్యాన్సర్ కు చికిత్స చేయించుకోవడానికి అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆయన అమెరికా వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. సంజయ్ దత్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇంతవరకు బయట పెట్టలేదు. అభిమానులు మాత్రం సంజయ్ ట్విట్టర్ ఖాతాకు రీ ట్వీట్లు చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu