షిర్డీలో నిరవధిక బంద్.. యథావిధిగా ఆలయ దర్శనాలు!

మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థల వివాదం ముదురుతోంది. ఇవాళ్టి నుంచి షిర్డీవాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ప్రభావం మాత్రం ఆలయంపై ఉండబోదని సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగాలికర్‌ స్పష్టం చేశారు. ఆలయ దర్శనాలు, పూజలు, తదితర కార్యక్రమాలన్నీ కూడా యధావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. దర్శనం నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామన్నారు. బాబా జన్మస్థలమైన పాథ్రీని భక్తుల సౌకర్యార్ధం అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మహా […]

షిర్డీలో నిరవధిక బంద్.. యథావిధిగా ఆలయ దర్శనాలు!
Follow us

|

Updated on: Jan 19, 2020 | 12:51 PM

మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థల వివాదం ముదురుతోంది. ఇవాళ్టి నుంచి షిర్డీవాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ప్రభావం మాత్రం ఆలయంపై ఉండబోదని సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగాలికర్‌ స్పష్టం చేశారు. ఆలయ దర్శనాలు, పూజలు, తదితర కార్యక్రమాలన్నీ కూడా యధావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. దర్శనం నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామన్నారు.

బాబా జన్మస్థలమైన పాథ్రీని భక్తుల సౌకర్యార్ధం అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మహా సీఎం ఉద్దవ్ థాక్రే ఇటీవల ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పాథ్రీ అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాముఖ్యత తగ్గిపోతుందని స్థానికులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వీఖే పాటిల్ కూడా మద్దతు తెలిపారు.

అయితే బాబా జన్మస్థలం పాథ్రీనేనని దానిని రుజువు చేయడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ స్పష్టం చేశారు. తమ దగ్గర 29 సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 1950వ సంవత్సరం నుంచి బాబా పాథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా 1988లో బాబా నివసించిన ప్రదేశంలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానికులు నిర్మించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే పాథ్రీ డిమాండ్ ఇప్పటిది కాదని.. రామ్‌నాధ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడే పాథ్రీ అభివృద్ధి కోసం అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రూ.100 కోట్లు అడిగారని స్పష్టం చేశారు. కానీ ఆయన స్పందించలేదని చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ బంద్ సమయంలో షిర్డీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూసి ఉంటాయని తెలుస్తోంది. కేవలం మహారాష్ట్ర స్టేట్ బస్సులను మాత్రమే అనుమతిస్తారని సమాచారం. మరోవైపు పాథ్రీ కృతి సమితి కూడా పాథ్రీలో బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, సీఎం ఉద్దవ్ థాక్రే ఈ వివాదంపై సోమవారం ట్రస్ట్, స్థానికులతో చర్చలు జరుపుతారని మహారాష్ట్ర సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

Latest Articles
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!