రియాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తిని సెప్టెంబర్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి స్థానిక కోర్టు అనుమతించింది. 

రియాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
Follow us

|

Updated on: Sep 08, 2020 | 10:35 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తిని సెప్టెంబర్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి స్థానిక కోర్టు అనుమతించింది.  అంతేకాదు రియా బెయిల్ కోసం చేసిన దరఖాస్తును తిరస్కరించింది. 

రియాను  ఈ రోజు మధ్యాహ్నం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజులుగా ఎన్.సీ.బీ రియాను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసు విచారణలో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో వారికి ఎన్.సీ.బీ నోటీసులు  జారీ చేయనుంది. కాగా విచారణలో తనకు డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు రియా అంగీకరించింది. డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ ను  ఐదు సార్లు కలిసినట్టు పేర్కొంది.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !