Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా.. డబ్బులే డబ్బులు..

క్రియేటివిటీ ఒకడి సొత్తు కాదు.. ఈ సామెత అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దుబాయ్ వాసులు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. డబ్బులు రాబడుతున్నారు. అదెలాగో తెలుసా.? ప్రస్తుతం దుబాయ్‌ను వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏడాదంతా కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల వ్యవధిలోనే..

Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా.. డబ్బులే డబ్బులు..
Viral Video
Follow us

|

Updated on: Apr 18, 2024 | 9:33 AM

క్రియేటివిటీ ఒకడి సొత్తు కాదు.. ఈ సామెత అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దుబాయ్ వాసులు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. డబ్బులు రాబడుతున్నారు. అదెలాగో తెలుసా.? ప్రస్తుతం దుబాయ్‌ను వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏడాదంతా కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల వ్యవధిలోనే ఎడారి దేశంలో కురిసింది. దీంతో అక్కడి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చుతున్నారు అధికారులు. ఇక అక్కడి వర్షాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. వాటిల్లోనే ఒక వీడియో చూసిన నెటిజన్లు.. దుబాయ్ వాసుల తెలివిని మెచ్చుకుంటున్నారు. సబ్‌వే వద్ద నిలిచిన వరద నీటిలో కొందరు తెలివిగా బిజినెస్ చేస్తున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. సబ్‌వేలలో నిలిచిన వరద నీటి వల్ల మహిళలు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే.. కొందరు ఆ వరద నీటిని తమకు అనుకూలంగా మార్చుకుని బిజినెస్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో వినియోగించే కార్ట్‌లతో వరద నీటిలో నడిచేందుకు ఇబ్బంది పడే మహిళలను అందులో ఎక్కించుకుని అవతలి వైపునకు చేర్చుతున్నారు. అలా చేర్చడం ద్వారా వారి దగ్గర నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. భలేగా ఉందే ఈ వ్యాపారం అని ఒకరు కామెంట్ చేస్తే.. వాహ్ భాయ్.. వాహ్ అంటూ మరొకరు వారి వినూత్న ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి.

Latest Articles