వైరల్‌గా మారిన రామ్‌తో భళ్లాలదేవుడి డబ్‌స్మాష్‌

rana and ram dubsmash viral : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దగ్గుబాటి రానాలు సినిమా సహచరులు మాత్రమే కాదు క్లాస్‌మేట్స్‌ కూడా. అంతేకాదు దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇదిలావుంటే… లాక్‌డౌన్‌ సమయంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రీ పోస్ట్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో రానా, రామ్‌ చరణ్‌లకు సంబంధించిన ఓ డబ్‌స్మాష్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ […]

వైరల్‌గా మారిన రామ్‌తో భళ్లాలదేవుడి డబ్‌స్మాష్‌

Updated on: May 29, 2020 | 4:40 PM

rana and ram dubsmash viral : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దగ్గుబాటి రానాలు సినిమా సహచరులు మాత్రమే కాదు క్లాస్‌మేట్స్‌ కూడా. అంతేకాదు దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇదిలావుంటే… లాక్‌డౌన్‌ సమయంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రీ పోస్ట్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో రానా, రామ్‌ చరణ్‌లకు సంబంధించిన ఓ డబ్‌స్మాష్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

మగధీర సినిమాలోని ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ ఖాన్‌ ఒకేసారి వందమందిని పంపు’అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌కు వీరిద్దరూ కలిసి డబ్‌ష్మాష్‌ చేశారు. ఆ డబ్‌ష్మాష్‌‌ను 2015లో రానా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘డబ్‌స్మాష్‌ విత్ భైరవ ’ అంటూ కామెంట్‌ ట్యాగ్ చేశాడు. ఇక దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. ప్రేమలో విజయం సాధించిన భళ్లాలదేవుడు పెళ్లి పనుల్లో తెగ బిజీగా మారిపోయాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us