చిరు బాటలో ‘చిరుత’ పయనం..భలే మాస్టర్ ప్లాన్ !

నాన్న రూట్లోనే నేనూ అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే థీమ్ ని తాము నమ్ముతూనే కొత్త జెనరేషన్ కి రీఇంట్రొడ్యూస్ చెయ్యాలని తపన పడుతున్నారు.

చిరు బాటలో 'చిరుత' పయనం..భలే మాస్టర్ ప్లాన్ !
Follow us

|

Updated on: Nov 19, 2020 | 9:42 AM

నాన్న రూట్లోనే నేనూ అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే థీమ్ ని తాము నమ్ముతూనే కొత్త జెనరేషన్ కి రీ-ఇంట్రొడ్యూస్ చెయ్యాలని తపన పడుతున్నారు. పనిలో పనిగా తన ఖాతాలో పక్కా కమర్షియల్ హిట్ జమ చేసుకోవాలన్నది చెర్రీ మాస్టర్ ప్లాన్. ఈ క్రమంలో తనను మగధీరగా ఎలివేట్ చేసి.. సక్సెస్ ఫుల్ స్టార్ కిడ్ గా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకధీరుడు రాజమౌళితో మళ్ళీ జట్టుకట్టారు చరణ్. హిందీ డైరెక్ట్ మూవీ జంజీర్‌తో సాధించలేక పోయిన పాన్ ఇండియా క్రేజ్‌ని.. ఇప్పుడు జక్కన్నతో సొంతం చేసుకోవాలన్నది చెర్రీ ఆశ . దాదాపు ఇదే స్కెచ్ తో ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ని కూడా లైన్లో పెట్టారు చరణ్.

తనకు విజయవంతమైన డెబ్యూ మూవీనిచ్చి.. మెగా ఫ్యాన్స్ కి గ్రాండ్ గా ఇంట్రొడ్యూస్ చేసిన పూరీతో మరో సినిమాకు రెడీ అంటూ సైగ చేశారట చరణ్. చిరుత తర్వాత యాక్షన్ బేస్డ్ మూవీస్ చాలానే చేసినా.. చిరుత మార్క్ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కడా పడలేదన్న వెలితిని ఫీలవుతున్నారు చరణ్. అందుకే.. నాకు మరో చిరుత కావాలి అని డిమాండ్ పెట్టారు. లాక్ డౌన్ గ్యాప్ లో రాసుకున్న కథల్లో చరణ్ కోసం ఒకటి రిజర్వ్ చేసిపెట్టారట పూరి.

సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, ఆఖరికి సందీప్ వంగా.. ఇలా ఆరేడు మంది దర్శకులు చెప్పిన  కథలు విన్నప్పటికీ.. అందరినీ వెయిటింగ్ లో పెట్టి.. తన డెబ్యూ డైరెక్టర్ పూరీనే పిక్ చేసుకోబోతున్నారు చరణ్. ఠాగూర్ డైరెక్టర్ వినాయక్ ని పిలిచి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ థాట్ ప్రాసెస్ నే చరణ్ కూడా ఫాలో అవుతున్నారన్న మాట. సో.. వినయ్ లాగే మాస్ ఆడియెన్స్ ని భద్రంగా కాపాడుకునే స్టామినా పూరి దగ్గరే ఎక్కువని చరణ్ కూడా బాగా నమ్ముతున్నారు.

Also Read :

పచ్చిచేపను కసకస కొరికి తినేసిన శ్రీలంక మాజీ మంత్రి..ఎందుకంటే ?

శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర

Breaking : జమ్ములో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు