బాలు.. మీరు త్వరగా కోలుకోవాలి..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యం విషమంగా మారిందంటూ వార్తలు రావడంతో సినీ ప్రపంచం మొత్తం ఆందోళనకు గురైంది. ఇదే క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్

బాలు.. మీరు త్వరగా కోలుకోవాలి..

Updated on: Aug 17, 2020 | 3:25 PM

Rajinikanth on S P Balasubrahmanyam : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యం విషమంగా మారిందంటూ వార్తలు రావడంతో సినీ ప్రపంచం మొత్తం ఆందోళనకు గురైంది. ఇదే క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలు సర్.. మీరు త్వరగా కోలుకోవాలి అని మెస్సెజ్ పెట్టారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యం విషమంగా ఉందంటూ ఇటీవ‌ల ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేయ‌గా, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ఆందోళ‌న చెందారు. ఆయ‌న క్షేమంగా క‌రోనా నుండి బ‌య‌ట‌పడాల‌ని ప్రార్ధించారు. అంద‌రి ప్రార్ధ‌న‌ల వ‌ల‌న బాలు ఆరోగ్యం కాస్త కుదుట పడ్డట్లుగా ఆయన తనయుడు చరణ్ పేర్కొన్నారు. నాన్న డాక్టర్ ను గుర్తు పట్టడంతో పాటు మాట్లాడుతున్నారంటూ చరణ్ పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us