Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది

Positive Development on Covid: ఒక వైపు కరోనా మహహ్మారి.. మరోవైపు లాక్‌డౌన్‌.. ఇంకోవైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌.. ఇలా కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు...

Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది
Positive Development
Follow us

|

Updated on: May 31, 2021 | 10:42 AM

Positive Development on Covid: ఒక వైపు కరోనా మహహ్మారి.. మరోవైపు లాక్‌డౌన్‌.. ఇంకోవైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌.. ఇలా కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా తగ్గిపోయాయి. ఇక కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల కంటే రికవరీ రేటు కూడా బాగానే ఉంది.

ఇక మిర్యాలగూడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 89 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. హనుమాన్‌ పేటలో నివాసముంటున్న రాఘవరెడ్డి ఈనెల 12న కోవిడ్‌ బారిన పడగా, 14న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఎట్టకేలకు కరోనా జయించి బయటపడ్డాడు.

కరోనాను జయించిన ఒకే కుటుంబంలో 26 మంది

ఇక కరోనా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని వెంటాడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా మహమ్మారిని జయించి కోవిడ్ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరిలో 85 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. యోగా చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం సహా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ఇది సాధ్యమైందని ఆ కుటుంబం చెబుతోంది. కుటుంబ పెద్ద అయిన 85 ఏళ్ల రాఘవేంద్రప్రసాద్‌ మిశ్రా.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ దక్షిణ మలాకాలో తన 8 మంది కుమారులు, వారి కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది. 31 మంది ఉండే ఆ కుటుంబంలో రాఘవేంద్రమిశ్రా సహా మరో 25 మంది ఇంటి సభ్యులకు కరోనా సోకింది. కరోనా వచ్చిందని భయాందోళన చెందకుండా ఇంట్లోనే ఉండి కరోనాను జయించింది ఈ కుటుంబం.

ఇక శ్రీకాకుళం జిల్లాలో వందేళ్ల వృద్ధురాలు సైతం కరోనాతో పోరాడి ప్రాణాలతో బయటపడింది. సావరకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన సీతారామమ్మ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ స్వయాన పెద్దమ్మ. కరోనా బారిన పడిన ఆమె .. తన కుటుంబ సభ్యులు నిత్యం ఉదయం తేనె కలిపిన నిమ్మరసం, మాంసాహారంతో భోజనం, బొప్పాయి, పళ్ల రసాయిలు అందించారు. మనో ధైర్యంతో కోవిడ్‌ను జయించారు.

ఇవీ కూడా చదవండి:

India Corona: భారత్‌తో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. రికవరీ శాతం ఎక్కువ.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Coronavirus: కరోనా నుంచి కోలుకున్న‌ తర్వాత అటాక్ చేస్తోన్న ప్ర‌ధాన జ‌బ్బులు ఇవే – జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు