దారుణం.. ఏకంగా పోలీసుకే నిప్పంటించి.. చివరకు..!

మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అంతా మాస్క్‌ ధరించాలన్న రూల్స్ ఉన్నాయి. మోజార్టీ దేశాలు ఈ మాస్క్ ధరించే నిబంధన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

దారుణం.. ఏకంగా పోలీసుకే నిప్పంటించి.. చివరకు..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 3:28 PM

మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అంతా మాస్క్‌ ధరించాలన్న రూల్స్ ఉన్నాయి. మోజార్టీ దేశాలు ఈ మాస్క్ ధరించే నిబంధన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మెక్సికోలో ఓ వ్యక్తి మాస్క్ వేసుకోకుండా పోలీసుల కంటపడ్డాడు. అయితే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అతడు ఓ చోట శవమై తేలాడు. దీంతో పోలీసులే అతడిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపేశారంటూ నిరసనలు మొదలయ్యాయి. పోలీసులు పట్టుకున్న వ్యక్తి మృతదేహం లభించడంతో.. పోలీసులు కావాలనే కొట్టి చంపేశారంటూ నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికోలోని గాదల్‌రాజారాలో నిరసనలు మిన్నంటాయి. అంతేకాదు ఆందోళనలు అదుపుతప్పాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో అతడి వీపు భాగంపై మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న అధికారులు స్పందించి.. మంటలను ఆర్పేశారు. అక్కడి నుంచి అధికారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.