జషిత్ వచ్చాడు.. మరి మా బాబు ఎక్కడయ్యా..?

కిడ్నాప్‌కు గురై నాలుగు రోజులుగా పోలీసుల్ని హడావుడి చేయించిన జషిత్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో జషిత్ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది. మరి జషిత్ లాగే మరో బాలుగు ఆరుష్ రెడ్డి తప్పిపోయి దాదాపు నెల రోజులు అవుతోంది. అయినా బాబు ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. నెల రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ బాబు ఆచూకీ తెలియక తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు. జషిత్ లా తమ బాబు కూడా […]

జషిత్ వచ్చాడు.. మరి మా బాబు ఎక్కడయ్యా..?
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 10:18 AM

కిడ్నాప్‌కు గురై నాలుగు రోజులుగా పోలీసుల్ని హడావుడి చేయించిన జషిత్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో జషిత్ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది. మరి జషిత్ లాగే మరో బాలుగు ఆరుష్ రెడ్డి తప్పిపోయి దాదాపు నెల రోజులు అవుతోంది. అయినా బాబు ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. నెల రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ బాబు ఆచూకీ తెలియక తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు. జషిత్ లా తమ బాబు కూడా తిరిగి రావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డి, జ్యోతిల దంపతుల రెండేళ్ల కుమారుడు ఆరుష్‌రెడ్డి. జూన్ 24న ఇంటి ఆవరణలో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఆరుష్ రెడ్డి తిరిగిరాలేదు. ఊరంతా గాలించినా బాబు ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుష్ అదృశ్యం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజులు హడావుడి చేసి ఊరుకున్నారు. అయితే అదే సమయంలో పోలీసులు బదిలీలు జరగడంతో ఆ హడావుడిలో పడి బాలుడి అదృశ్యం గురించి పట్టించుకోలేదని ఆరుష్ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.