బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుందిః మోదీ

బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుందిః మోదీ

దేశమంతా కమలం విరబూస్తోందన్నారు ప్రధానమంత్రి మోదీ. దేశంలో సుపరిపాలన అందించడం వల్లే ప్రజల మద్దతు తమకు లభిస్తోందన్న ప్రధాని.. సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌ - సబ్‌కా విశ్వాస్‌ వల్లే ఎన్నికల్లో విజయం సాధించినట్టు చెప్పారు.

Balaraju Goud

|

Nov 11, 2020 | 9:02 PM

దేశమంతా కమలం విరబూస్తోందన్నారు ప్రధానమంత్రి మోదీ. దేశంలో సుపరిపాలన అందించడం వల్లే ప్రజల మద్దతు తమకు లభిస్తోందన్న ప్రధాని.. సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌ – సబ్‌కా విశ్వాస్‌ వల్లే ఎన్నికల్లో విజయం సాధించినట్టు చెప్పారు. బీహార్‌లో ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న విజయోత్సవ సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. భీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలుచోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారీ విజయం అందించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిందన్నారు.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ సవాళ్లను అధిగమించి ప్రజలు ఓట్లు వేసి ఎన్డీయే కూటమికి పట్టం కట్టారన్నారు. బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుందన్న ప్రధాని ప్రజలకు సేవ చేయడం ఎలాగో తమ పార్టీకి తెలుసునన్నారు. దేశ నలుమూలలకూ బీజేపీ చేరిపోయిందన్న ప్రధాని.. దేశ వికాసం కోసం శ్రమిస్తున్నందునే జనం బీజేపీ వైపు నిలిచారని చెప్పారు. భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారన్న నమ్మకం ఉందన్నారు. బీహార్‌లో గతంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగేవని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జనం భారీగా తరలివచ్చి ఓట్లు వేసి ఎన్డీయే కూటమికి పట్టం కట్టారన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు.. బీజేపీకి అతిపెద్ద సైలెంట్‌ ఓటర్లుగా మారారన్న మోదీ.. భారత మహిళల జీవన ప్రమాణాల మెరుగుకు బీజేపీ కృషిచేసిందన్నారు. అలాగే, పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం నిలిచిన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu