మరో రెండేళ్ల పాటు బ్యాటింగ్ కోచ్ ఇతనే…

మరో రెండేళ్ల పాటు బ్యాటింగ్ కోచ్ ఇతనే...

పాక్‌ జట్టు ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ యూనీస్‌ ఖాన్‌ పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు  పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ...

Sanjay Kasula

|

Nov 12, 2020 | 4:26 PM

Batting Coach Younis Khan : పాక్‌ జట్టు ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ యూనీస్‌ ఖాన్‌ పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు  పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే  t20 ప్రపంచ కప్ వరకు మాజీ కెప్టెన్ పురుషుల బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతారని పీసీబీ తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టుకు ఖాన్‌ను మొదట బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించారు. పాక్‌ జట్టుతో కలిసి యూనీస్‌ త్వరలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్నాడు. డిసెంబరు 18న ఆరంభంకానున్న పర్యటనలో ఆతిథ్య కివీస్‌తో పాకిస్తాన్ మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడనుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu