పవన్-క్రిష్ మూవీలో.. రంగమ్మత్తకు సంచలన పాత్ర..!

Pawan Kalyan-Krish Movie: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటుగా సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ పింక్ మూవీ తెలుగు రీమేక్‌లో బిజీగా ఉన్న జనసేనాని త్వరలోనే క్రిష్ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక కథ నేపథ్యంలో సాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక దీనితో పాటుగా హరీష్ శంకర్ సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు త్రివిక్రమ్, […]

పవన్-క్రిష్ మూవీలో.. రంగమ్మత్తకు సంచలన పాత్ర..!

Pawan Kalyan-Krish Movie: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటుగా సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ పింక్ మూవీ తెలుగు రీమేక్‌లో బిజీగా ఉన్న జనసేనాని త్వరలోనే క్రిష్ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక కథ నేపథ్యంలో సాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక దీనితో పాటుగా హరీష్ శంకర్ సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు త్రివిక్రమ్, పూరి జగన్నాధ్‌లతో కూడా మూవీలు లైన్‌లో ఉన్నట్లు వినికిడి.

ఇదిలా ఉండగా పవన్- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సహకరించే పవర్‌ఫుల్ బందిపోటుగా అనసూయ కనిపిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించనుంది.

కాగా, ‘అత్తారింటికి దారేది’ సినిమాలోనే అనసూయకు ఛాన్స్ వస్తే.. డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో అది వదిలేసుకుంది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం రావడం ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Published On - 7:37 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu