ఆ మూడంశాలే కీలకం.. సోనియా చేతిలో సూపర్ ఎజెండా

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సిద్ధమవుతున్న విపక్షాలు మూడు ప్రధాన అస్త్రాలతో మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు నాలుగేసి...

ఆ మూడంశాలే కీలకం.. సోనియా చేతిలో సూపర్ ఎజెండా
Follow us

|

Updated on: Sep 07, 2020 | 1:33 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సిద్ధమవుతున్న విపక్షాలు మూడు ప్రధాన అస్త్రాలతో మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు నాలుగేసి గంటలపాటు పార్లమెంటు ఉభయ సభలు వర్షాకాల సమావేశాల కోసం భేటీ కాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో సమావేశం కాబోతున్న విపక్ష పార్టీల అధినేతలు.. నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం సరిహద్దు రక్షణలో విఫలమైందని భావిస్తున్న విపక్షాలు దానిని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై దాడికి సిద్ధమవుతున్నాయి. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇదే అభిప్రాయంతో ఉన్న విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.

దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా లేవనెత్తాలని విపక్ష నేతలు నిర్ణయించారు. అదేవిధంగా గత ఆరు నెలలుగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు పూర్తిగా కుదేలయినప్పటికీ.. రాష్ట్రాలకు సాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు అందించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సబబుగా లేదని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ అంశాన్ని మూడో ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి.

ఈ మూడు ప్రధాన అంశాలుగా.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే కీలక అంశాలుగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. సెప్టెంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ వ్యూహ కమిటీని సమావేశపరచబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం యూపీఏ పక్షాలతో కాంగ్రెస్ అధినేత్రి భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో యూపీఏలో లేని బీజేపీయేతర పార్టీలను ఒక్క తాటిమీద తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్, చైనా సరిహద్దు వివాదం.. దేశ రక్షణ విషయంలో మోడీ వైఫల్యం, కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రాలకు జీఎస్టీ నిధులను ఇవ్వడంలో నిర్లక్ష్యం వంటి అంశాలు ఎజెండాగా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలతో పాటు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశం కాబోతున్నాయి. పార్లమెంట్‌లో అవలంభించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నాయి.

కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, డీఎంకే అధినేత స్టాలిన్, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ తదితరులు పార్లమెంటు వ్యూహంపై తరచూ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్