కొత్త చట్టం ఎఫెక్ట్..ట్రక్ డ్రైవర్‌కు భారీ ఫైన్..ఏకంగా రూ.86,500

కొత్త మోటార్ వాహన సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్లతో రూల్స్ పాటించనివారి తాట తీస్తున్నారు. ఊహించని స్థాయిలో జరిమానాలు వేస్తూ వాహనదారుల బెండ్ తీస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ ట్రక్ డ్రైవర్‌కు అధికారులు రూ. 86,500ల జరిమానా విధించారు. నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చాక ఇంతటి అధిక మొత్తం జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెప్టెంబర్‌ 3న జరిమానా విధించగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాగాలాండ్‌కు […]

కొత్త చట్టం ఎఫెక్ట్..ట్రక్ డ్రైవర్‌కు భారీ ఫైన్..ఏకంగా రూ.86,500

కొత్త మోటార్ వాహన సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్లతో రూల్స్ పాటించనివారి తాట తీస్తున్నారు. ఊహించని స్థాయిలో జరిమానాలు వేస్తూ వాహనదారుల బెండ్ తీస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ ట్రక్ డ్రైవర్‌కు అధికారులు రూ. 86,500ల జరిమానా విధించారు. నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చాక ఇంతటి అధిక మొత్తం జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెప్టెంబర్‌ 3న జరిమానా విధించగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాగాలాండ్‌కు చెందిన బీఎల్‌ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన జేసీబీని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా.. ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ట్రక్కు పట్టుబడింది. దీంతో అధికారులు భారీ మొత్తంలో ట్రక్కు డ్రైవర్‌ అశోక్‌ జాదవ్‌కు ఫైన్‌ వేశారు.

ఫైన్ల ఏయే నిబంధనల క్రింద వేశాారంటే:

అనధికారిక వ్యక్తికి డ్రైవింగ్‌కు అనుమతించినందుకు రూ.5000

ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నందుకు రూ. రూ.20,000

18 టన్నుల అదనపు బరువును తీసుకెళుతున్నందుకు  రూ.56,000

లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేసినందుకు రూ.5000

సాధారణ తప్పిదాలకు మరో రూ.500

కాగా అంత పెద్ద మొత్తం ఇచ్చకోలేనని ట్రక్ డైవర్ అధికారులను వేడుకోకున్నాడు. దాదాపు 5 గంటల పాటు ట్రక్ డైవర్‌కు, పోలీసులకు మధ్య జరిగిన తర్జనభర్జనల అనంతరం అధికారులు జరిమానాను 70,000వేలకు కుదించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొత్త వాహన చట్టం సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి రాగా.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే రూ.88 లక్షలు జరిమానా కింద వసూలు చేసింది. దేశంలోనే అత్యధిక మొత్తం జరిమానా విధించిన రాష్ట్రంగానూ ఒడిశా నిలిచింది.

Click on your DTH Provider to Add TV9 Telugu