బోరబండకు అక్టోబర్ భయం.. అప్పట్లో ఏం జరిగిందంటే?

రెండ్రోజులుగా స్వల్ప భూ ప్రకంపనలతో వణుకుతున్న హైదరాబాద్ బోరబండ ఏరియా వాసులను అక్టోబర్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్ నగరం మధ్యలో..

బోరబండకు అక్టోబర్ భయం.. అప్పట్లో ఏం జరిగిందంటే?
Follow us

|

Updated on: Oct 03, 2020 | 1:53 PM

October tension in Borabanda people: రెండ్రోజులుగా స్వల్ప భూ ప్రకంపనలతో వణుకుతున్న హైదరాబాద్ బోరబండ ఏరియా వాసులను అక్టోబర్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్ నగరం మధ్యలో వున్న బోరబండ ఏరియాలోనే భూకంపాలు ఎందుకు వస్తున్నాయనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. మళ్ళీ అక్టోబర్‌ నెలలోనే భూకంపం రావడంతో స్థానికులు వర్రీ అవుతున్నారు.

సరిగ్గా మూడేళ్ళ క్రితం అంటే 2017 అక్టోబర్ నెలలో బోరబండలో భూప్రకంపనలు సంభవించాయి. అప్పట్లోను రాత్రిళ్ళు జనం టెన్షన్ టెన్షన్‌తో గడిపారు. ఈ భూప్రకంపనలు మాగ్నిట్యూడ్ పరంగా స్వల్పంగానే వున్నప్పటికీ.. తరచూ అక్టోబర్‌ నెలలోనే ఎందుకు సంభవిస్తున్నాయన్నది చర్చనీయాంశమైంది.

శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల నుంచి రాత్రి 11 మధ్యలో బోరబండ ఏరియాలో భూప్రకంపనలు సంభవించాయి. జనం ఇళ్ళలోంచి బయటికి పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. పొద్దున్నే ఇక రావేమో అనుకున్న ఇళ్ళలోకి వెళ్ళిన జనం శనివారం ఉదయం కూడా పలు మార్లు భూకంపనలతోపాటు భూమి లోంచి వింత వింత శబ్దాలు రావడంతో జనం మరోసారి వీధుల్లోకి పరుగులు పెట్టారు.

1994 నుంచి 2017 మధ్య కాలంలో బోరబండకు సమీపంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో 979 సార్లు భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల వద్ద రికార్డు వుంది. 2017 అక్టోబర్ నెలలో వచ్చినట్లుగానే ఇపుడు కూడా భూ ప్రకంపనలతోపాటు భూమి లోంచి శబ్ధాలు రావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా సంభవించిన భూప్రకంపనల తీవ్రత 1.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు ఎన్జీఆర్ఐ తెలిపింది.