ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే…

కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకు కోపమొచ్చింది. ఏకంగా ఓ వేదికపైనే ఆగ్రహంగా లేచి వెళ్లి.. లింగాయత్ కులానికి చెందిన ఓ స్వామీజీ మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దావణగేరె లోని హరిహరలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన నిగ్రహాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీలో తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మురుగేష్ నీరానీ అనే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ  వేదికపైనే ఉన్న వచనానందస్వామి కోరడం ఆయన కోపానికి కారణమైంది. ‘ నీరానీని నిర్లక్ష్యం చేయరాదని, అతని గురించి […]

ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 2:14 PM

కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకు కోపమొచ్చింది. ఏకంగా ఓ వేదికపైనే ఆగ్రహంగా లేచి వెళ్లి.. లింగాయత్ కులానికి చెందిన ఓ స్వామీజీ మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దావణగేరె లోని హరిహరలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన నిగ్రహాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీలో తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మురుగేష్ నీరానీ అనే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ  వేదికపైనే ఉన్న వచనానందస్వామి కోరడం ఆయన కోపానికి కారణమైంది. ‘ నీరానీని నిర్లక్ష్యం చేయరాదని, అతని గురించి పట్టించుకోకపోతే మా లింగాయత్ ల మద్దతును మీరు కోల్పోతారని ఆ స్వామీజీ హెచ్చరించారు. దీంతో ఎర్రబడిన ముఖంతో వేదికపైనే విసవిసా నడిచి వఛ్చి.. ఎడ్డీ.. ఆయన కాళ్లకు నమస్కరిస్తూనే.. ఇదంతా వినడానికి తానిక్కడికి రాలేదని, మీ డిమాండ్ల ప్రకారం నడచుకోలేనని.. అంటూ.. ఇక వెళ్ళిపోతా ‘ అంటూ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. అయితే రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై సహా ఇతర సహచరులంతా నచ్చజెప్పడంతో యెడ్యూరప్ప మళ్ళీ తన సీటువద్దకు వెళ్లి కూర్చున్నారు. ఆ తరువాత జరిగిన ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఎడ్డీ.. తనను ముఖ్యమంత్రిని చేయడానికి సాయపడి తమ పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయాన్ని తాను చూసుకోవాల్సి ఉందన్నారు. దయచేసి వచనానందస్వామి వంటివారు తన పరిస్థితిని గమనించాలని,, ఆ రెబల్ ఎమ్మెల్యేలే తనకు సహాయ పడిఉండకపోతే తాను ముఖ్యమంత్రిని అయ్యే వాడినే కానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పదవికి అంటిపెట్టుకుని ఉండాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.. ‘ మీరు కోరితే రేపే రాజీనామా చేస్తా ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా-బిల్గి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురుగేష్ నీరానీ అత్యంత శక్తిమంతమైన లింగాయత్ కులానికి చెందినవారు. వారు తలచుకుంటే కర్ణాటకలో బీజేపీ ఓట్లకే గండి కొట్టగలరు. ఈ నెలాఖరులో ఎడ్డీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు