కుమారస్వామికి కాస్త ఊరట.. ప్రస్తుతానికి యధాతథ స్థితి..సుప్రీం ఆదేశం

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యధాతథ స్థితిని మంగళవారం వరకు కొనసాగించాలని ఆదేశించింది. వీరి పిటిషన్ పై మళ్ళీ విచారణ జరుపుతామని సూచించింది. వీరి రాజీనామాల విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు కొంత వ్యవధి కావాలని స్పీకర్ రమేష్ కుమార్..కోర్టును అభ్యర్థించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. తన క్లయింటు చేసిన వినతిలోని అంశాలను […]

కుమారస్వామికి కాస్త ఊరట.. ప్రస్తుతానికి యధాతథ స్థితి..సుప్రీం ఆదేశం
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 4:50 PM

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యధాతథ స్థితిని మంగళవారం వరకు కొనసాగించాలని ఆదేశించింది. వీరి పిటిషన్ పై మళ్ళీ విచారణ జరుపుతామని సూచించింది. వీరి రాజీనామాల విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు కొంత వ్యవధి కావాలని స్పీకర్ రమేష్ కుమార్..కోర్టును అభ్యర్థించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. తన క్లయింటు చేసిన వినతిలోని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ లో ఔచిత్యం లేదన్నారు. వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవలసిందిగా స్పీకర్ ను కోర్టు ఆదేశించజాలదని సింఘ్వీ అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద.. వారి రాజీనామాలపై స్పీకరే నిర్ణయం తీసుకోవలసిఉంటుందని ఆయన అన్నారు.

ఇలా ఉండగా.. రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కోరుతున్నట్టు సీఎం కుమారస్వామి శాసన సభలో ప్రకటించారు. సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి అనుమతించాలని ఆయన స్పీకర్ ను అభ్యర్థించారు. తన ప్రభుత్వ మనుగడకు సంబంధించి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కుమారస్వామి కోరిన విషయం తెలిసిందే. అటు-గురువారం తనను కలుసుకున్న ఈ ఎమ్మెల్యేల పట్ల రమేష్ కుమార్ కొంత దురుసుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తమ పిటిషన్లను మళ్ళీ పరిశీలించాల్సిందిగా తాము కోరగా.. ‘ గో టు హెల్ ‘ అని ఆయన ఆగ్రహంగా దుర్భాషలాడినంత పని చేశారని వీరు మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో కుమారస్వామి ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టయ్యింది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..