నేపాల్ కవ్వింపు చర్యలు.. భారత్‌కు వ్యతిరేకంగా పాటలు..

గత కొద్దిరోజులుగా భారత్‌పై వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపాల్ ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ..

నేపాల్ కవ్వింపు చర్యలు.. భారత్‌కు వ్యతిరేకంగా పాటలు..
Follow us

|

Updated on: Jun 22, 2020 | 10:53 AM

గత కొద్దిరోజులుగా భారత్‌పై వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపాల్ ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ నేపాల్ తాజాగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తోంది. తన ఎఫ్‌ఎం ఛానల్స్‌లో పాటల రూపంలో నేపాల్, భారత్‌కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తోందని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా, లింపియాధుర,లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలు తమవేనని ఇప్పటికే నేపాల్ ఒక మ్యాప్‌ను విడుదల చేయడమే కాకుండా.. ఆ కొత్త మ్యాప్‌కు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపిన సంగతి విదితమే. వివాదాస్పద మ్యాప్ రాజ్యాంగ సవరణ ప్రక్రియను నేపాల్ గురువారం పూర్తి చేయగా.. గత వారం దిగువ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక గురువారం జాతీయ అసెంబ్లీలో ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ మూడు ప్రాంతాలను భారత్ తమకు అప్పగించాలని పాటల ద్వారా ఎఫ్‌ఎం రేడియో ఛానల్స్‌లో నేపాల్ ప్రచారం చేస్తోంది.