రెండో రోజు బాల త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటల నుంచే భక్తులకు దర్శనానికి అనుమతితచ్చారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు […]

రెండో రోజు బాల త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 8:30 AM

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటల నుంచే భక్తులకు దర్శనానికి అనుమతితచ్చారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 5700 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు. మరోవైపు శ్రీశైలంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి.

ఇక తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో కూడా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు..

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. ‘శ్రీ’ విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేస్తారు.

మంత్రం :

అరుణ కిరణ జాలై రంజితా సావకాశా విదృత జపతటీకాపుస్తకాభీతిహాసా, ఇతర వరకారాఢ్యా పుల్లకల్హాలసంస్థా నివసతు హృదిబాలా నిత్యకళ్యాణశీలా

బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేస్తారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..