Mystery Tunnel: ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. భూమి లోపల 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి

జెఫ్ ఇటీవల ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టన్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అక్కడ విలాసవంతమైన ఆఫీసుని నిర్మించాలనుకున్నాడు. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా శుభ్రపరిచే సమయంలో అతనికి ఒక మిస్టరీ డోర్ కనిపించింది. దాని లోపల అనేక సొరంగాలు. వాటి లోపల చాలా రహస్య గదులు కూడా ఉన్నాయి. ఆ రహస్య గదులు పెద్దవి కావు. 5-5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయని జెఫ్ చెప్పాడు. అవి ఆర్మీ బ్యారక్‌లా అంటే ఆర్మీ స్థావరాలు గా అనిపించాయని చెప్పారు.

Mystery Tunnel: ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. భూమి లోపల 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
Mystery Tunnels
Follow us

|

Updated on: Apr 19, 2024 | 7:41 PM

భూమి లోపల ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చి తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. కొన్నిసార్లు తెలియకుండా, శాస్త్రవేత్తలు లేదా సాధారణ వ్యక్తులు వందల లేదా వేల సంవత్సరాల నాటి రహస్యాలను బహిర్గతం చేసి.. అటువంటి ఆవిష్కరణలు చేస్తారు. బ్రిటన్‌లోని స్టాక్‌టన్ నగరంలో అలాంటిదే జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి, తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు.. అతను తనకు  తెలియకుండా ఒక రహస్య తలుపు తెరిచాడు. ఆ ఘటన వందల ఏళ్ల నాటి రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. ఆ వ్యక్తి ధైర్యం కూడగట్టుకుని ఆ రహస్య ద్వారంలోకి ప్రవేశించినప్పుడు.. అక్కడ ఉన్న వాటిని  చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పాడు.

ఆ వ్యక్తి పేరు జెఫ్ హైఫీల్డ్. 56 ఏళ్లు. ది సన్ నివేదిక ప్రకారం జెఫ్ ఇటీవల ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టన్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అక్కడ విలాసవంతమైన ఆఫీసుని నిర్మించాలనుకున్నాడు. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా శుభ్రపరిచే సమయంలో అతనికి ఒక మిస్టరీ డోర్ కనిపించింది. దాని లోపల అనేక సొరంగాలు. వాటి లోపల చాలా రహస్య గదులు కూడా ఉన్నాయి. ఆ రహస్య గదులు పెద్దవి కావు. 5-5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయని జెఫ్ చెప్పాడు. అవి ఆర్మీ బ్యారక్‌లా అంటే ఆర్మీ స్థావరాలు గా అనిపించాయని చెప్పారు.

సొరంగాలు 250 ఏళ్ల నాటివి

ఇవి కూడా చదవండి

జెఫ్ తన ఇంటి లోపల కనిపించిన సొరంగాలు, సెల్లార్‌లను చూసిన తర్వాత కొంచెం భయపడ్డాడు. వెంటనే పురావస్తు శాఖ సంబంధించిన అధికారులకు చెప్పాడు. ఈ సొరంగాలు 250 ఏళ్ల క్రితం నిర్మాణాలని.. ఈ సొరంగాలు నగరం అంతటా విస్తరించి ఉన్నాయని చెప్పారు. కొన్ని సొరంగాల దారులు నదుల దగ్గరకు వెళ్తాయని చెప్పారు.

చరిత్రకారుల ప్రకారం పూర్వం ప్రజలు సొరంగాలలో నిర్మించిన ఆ గదులలో నివసించేవారు. అయితే  కాలక్రమేణా ఈ భూములలో విలాసవంతమైన భవనాలు నిర్మించబడ్డాయి.  ఆ తర్వాత అక్కడ నివసించే ప్రజలు వేరే చోట నివసించడానికి వెళ్ళారు.

సొరంగాలు ఎందుకు నిర్మించారు? అయితే, ఈ సొరంగాలకు సంబంధించి అనేక ఇతర వాదనలు ఉన్నాయి. ఈ సొరంగాలు అక్రమ రవాణాకు ఉపయోగపడతాయని కొందరు అంటుండగా, ఇంతకు ముందు నగరంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ఆ మార్గాల్లోనే వెళ్లేవారని మరికొందరు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..