ఐసోలేషన్ వార్డులో ఉపిరాడక ని కరోనా పేషంట్ మృతి..!

రాజస్తాన్ లో దారుణం జరిగింది. ఐసోలేషన్ వార్డులోని కరోనా పేషంట్ ఉపిరాడక మృతి చెందాడు. ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉందని వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టడంతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

ఐసోలేషన్ వార్డులో ఉపిరాడక ని కరోనా పేషంట్  మృతి..!
Follow us

|

Updated on: Jun 20, 2020 | 1:26 PM

రాజస్తాన్ లో దారుణం జరిగింది. ఐసోలేషన్ వార్డులోని కరోనా పేషంట్ ఉపిరాడక మృతి చెందాడు. ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉందని వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టడంతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టింది. కోటాకు చెందిన 40 ఏళ్ల ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో జూన్ 13న మహారావ్ భీమ్ సింగ్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేరాడు. అతనికి కరోనా పరీక్ష నిర్వహించిన వైద్యులు నెగిటివ్ గా తేల్చారు. అయితే, అదే వార్డులో చేరిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉందని కూలర్ కావాలని నెగిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులను కోరాడు. దీంతో వెంటనే ఒక కొత్త కూలర్ కొని ఐసోలేషన్ వార్డుకు తీసుకువచ్చారు. అయితే వార్డులో కూలర్ ప్లగ్ పెట్టేందుకు మరో సాకెట్ లేకపోవడంతో.. వెంటిలేటర్‌ ప్లగ్ ను తీసేసి కూలర్ ప్లగ్ పెట్టారు. అలా పెట్టిన అరగంట తర్వాత వెంటిలేటర్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో పేషంట్ బంధువులు వైద్యసిబ్బందికి సమాచారమిచ్చారు. అప్పటికే పేషంట్ ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య తీవ్రంగా స్పందించింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. డిప్యూటీ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, డ్యూటీలో ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో కూడిన కమిటీ ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ సక్సేనా తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, ఐసోలేషన్ వార్డులో కూలర్ ఏర్పాటు కోసం కుటుంబసభ్యులెవరూ అనుమతి తీసుకోలేదని అస్పత్రి వర్గాలు తెలిపాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు