మధ్యప్రదేశ్ బైపోల్స్ లో ‘శివ్-సింథియాలదే’ విజయం ?

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3 న జరిగిన ఉపఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా లదే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అంటే శివరాజ్ సింగ్ ప్రభుత్వం 16 […]

మధ్యప్రదేశ్ బైపోల్స్ లో 'శివ్-సింథియాలదే' విజయం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 4:20 PM

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3 న జరిగిన ఉపఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా లదే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అంటే శివరాజ్ సింగ్ ప్రభుత్వం 16 నుంచి 18 సీట్లను, రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ 10 నుంచి 12 స్థానాలను గెలుచుకుంటారని తెలుస్తోంది. మరో ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం, బీజేపీ 14 నుంచి 16, కాంగ్రెస్ 10 నుంచి 13 సీట్లను గెలుచుకుంటాయని అంటున్నారు. ఈ ఎన్నికలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్,  జ్యోతిరాదిత్య సింథియా, ఇటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కమల్ నాథ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 10 న ఫలితాలను ప్రకటించనున్నారు.