ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల కలకలం

ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. మెలియాపుట్టి మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ద్విచక్రవాహనం పై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు ఎర్ర రాజేష్, రుంకు నవీన్ గా గుర్తించారు. వీరిద్దరూ టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్రావీధికి చెందిన వ్యక్తులని చెప్పారు. ఇంతకు ముందు వీరిద్దరూ ఆదిఆంధ్ర వీధిలో […]

  • Venkata Narayana
  • Publish Date - 8:30 am, Sun, 4 October 20
ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల కలకలం

ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. మెలియాపుట్టి మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ద్విచక్రవాహనం పై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు ఎర్ర రాజేష్, రుంకు నవీన్ గా గుర్తించారు. వీరిద్దరూ టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్రావీధికి చెందిన వ్యక్తులని చెప్పారు. ఇంతకు ముందు వీరిద్దరూ ఆదిఆంధ్ర వీధిలో పంది చనిపోయిన కేసు, సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరొక కేసులో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు.