Viral Video: కుందేలును వెంటాడి నోట పట్టిన చిరుత.. ఇంతలో ఆపద్బాంధవుడిలా వచ్చిన అడవి పంది

సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. కాని చిరుతపులికి కూడా అదే రేంజ్ బలం ఉంటుంది. దాని వేగం, వేట ఎంత సాలిడ్‌గా ఉంటాయో...

Viral Video: కుందేలును వెంటాడి నోట పట్టిన చిరుత.. ఇంతలో ఆపద్బాంధవుడిలా వచ్చిన అడవి పంది
Leopard Hunts Rabbit

Updated on: Jul 14, 2021 | 10:43 AM

సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. కాని చిరుతపులికి కూడా అదే రేంజ్ బలం ఉంటుంది. దాని వేగం, వేట ఎంత సాలిడ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి చిరుత కంట ఏదైనా జంతువు కనిపించింది అంటే ఇక దాని లైఫ్ ఖతం అయినట్లే.  చిరుతను ‘కనికరంలేని వేటగాడు’ అని పిలుస్తారు. తాజాగా చిరుత వేటకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే  అడవి నియమాలు చాలా భిన్నమైనవని మనందరికీ తెలుసు. జంగిల్‌లో ఎవరిని ఎప్పుడు వేటాడతారో, ఎవరికి ఎవరు మిత్రుడు అవుతాడో అస్సలు ఊహించలేం. తాజాగా చిరుతపులి ఒక కుందేలును వేటాడేందుకు ప్రయత్నించింది. మరో నిమిషంతో కుందేలు లైఫ్ ఖతం అవుతుంది అనుకుంటూ ఉండగా.. దాని పాలిట ఆపద్బాంధవుడిలా అడవి పంది మెరుపు వేగంతో వచ్చి ప్రాణాలు సేవ్ చేసింది.

వీడియో చూడండి

వీడియోలో, ఒక చిరుతపులి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండటం మీరు చూడవచ్చు. ఇంతలో కుందేలు తారసపడటంతో  దాన్ని వెంటాడి పట్టేసింది చిరుత.  దాన్ని నోట కరిచి వెనుదిరుగుతుండగా, అడవి పంది ఒక్క ఉదుటన అక్కడకు దూసుకువచ్చింది. దీంతో కుందేలును అక్కడ వదిలేసి.. చిరుత పరుగు లంకించుకుంది. వీడియో చూసిన తరువాత, మీరు ఒక్క క్షణం షాక్ అయి ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Also Read: అకస్మాత్తుగా ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ వీడియో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది..

ప్రపంచం మొత్తంలో తెలంగాణ కల్చర్ వెరీ స్పెషల్.. ‘సీతాల భవాని పండుగ’ గురించి మీకు తెలుసా..?

Loading...
Unable to load recommendations.
Follow Us