TANA Fest 2020 : “భాష, సంస్కృతిని విడిగా చూడ‌లేం..”

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో పెంపొందించడానికి తానా ప్రెసిడెంట్ జయ తాళ్ళూరి అధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మ‌హోత్సవం’ కార్యక్రమాలు ప్రారంభ‌మ‌య్యాయి.

TANA Fest 2020 : భాష, సంస్కృతిని విడిగా చూడ‌లేం..

Updated on: Jul 25, 2020 | 9:26 PM

TANA Fest 2020 Highlights : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో పెంపొందించడానికి తానా ప్రెసిడెంట్ జయ తాళ్ళూరి అధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మ‌హోత్సవం’ కార్యక్రమాలు ప్రారంభ‌మ‌య్యాయి. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్ని ఆన్ లైన్ లో ప్రారంభించారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తముగా 100కి పైగా తెలుగు సంఘాలు ఇందులో భాగ‌స్వామ్యం కానున్నాయి.

ఈ క్ర‌మంలో ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ..తెలుగువారంతా ఒక్కటే అనే భావనను ప్రతిబింబించాలని కోరారు. భాష అనేది మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. భాష, సంస్కృతిని విడిగా రెండుగా చూడలేమని తెలిపారు. తల్లిలాంటి మాతృభాషను సంర‌క్షించుకోవాల్సిన‌ అవసరం అందరిపై ఉందన్నారు. భాష అంటే కేవలం మాట్లాడుకునే నాలుగు మాటలు మాత్ర‌మే కాదని…సంస్కృతిని నింపుకున్న వ్యక్తీకరణ అని వెల్లడించారు.

ఇది కూడా చ‌ద‌వండి: రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధ‌ర‌…

Loading...
Unable to load recommendations.
Follow Us